ఎన్టీఆర్ జాతకం ఇక కొరటాల ట్రాక్ రికార్డు పైనే

0
198

ntrnsshntbsmtయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే సినిమాలు పోస్ట్ పోన్స్ అడ్డాగా మారిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న గట్టి వాదన. యంగ్ టైగర్ సినిమాల కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరైన సమయంలో విడుదల చేయలేకపోతున్నాడు.

ఎన్టీఆర్ నటించిన దమ్ము, బాద్ షా, టెంపర్, రభస, రామయ్యావస్తావయ్యా, నాన్నకుప్రేమతో సినిమాలన్నీ అనుకున్న సమయానికి ప్రేక్షకులముందుకు రాలేదు. వీటి రిలీజ్ డేట్స్ ని కనీసం రెండు మూడు నెలల ముందే అనౌన్స్ చేసి చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేశారు.

కాగా ఇందులో మంచి కంటెంట్ ఉన్న టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలకు సోలో అండ్ మంచి రిలీజ్ డేట్ దొరికి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కానీ అలా కుదరలేదని ఇప్పుడు మరోసారి జనతాగ్యారేజ్ పోస్ట్ పోన్ అవ్వడం పెద్ద దెబ్బే అని అంటున్నారు.

ఇదంతా ఎన్టీఆర్ ట్రాక్ రికార్డు కాగా మరోపక్క కొరటాల శివ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంతో కొరటాల హాట్రిక్ కొట్టే మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుండటంతో కొరటాల ట్రాక్ రికార్డే ఎన్టీఆర్ కి నికార్సయిన హిట్ ఇస్తుందని అందరూ నమ్ముతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY