కొరటాల షాకింగ్ కామెంట్స్ తో యూనిట్ మొత్తం షాక్ అయ్యింది

0
283

koratala shtnabsnsమిర్చి-శ్రీమంతుడు లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తరువాత క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త షికారు చేస్తోంది. అదీ .. మోహన్ లాల్ డబ్బింగ్ గురించి.

తనకి తెలుగు సినిమాల్లో అవకాశం రావడమే ఆలస్యం .. మోహన్ లాల్ తెలుగు భాషపై దృష్టి పెట్టాడు.తెలుగు బాగానే మాట్లాడుతూ ఉండటంతో, ‘మనమంతా’ సినిమాలో ఆయన పాత్రకిగాను ఆయనతోనే డబ్బింగ్ చెప్పించారు. అలా ‘జనతా గ్యారేజ్’ కి కూడా మోహన్ లాల్ తోనే డబ్బింగ్ చెప్పించాలని కొరటాల అనుకున్నాడు.

అయితే మోహన్ లాల్ భాషలో మలయాళ యాస వస్తుండటంతో, ఆయన పాత్రకి వేరొకరితో డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని మోహన్ లాల్ కి స్నేహపూర్వకంగానే చెప్పాడట. కానీ యూనిట్ మాత్రం కొరటాల డేరింగ్ నిర్ణయం చూసి షాక్ అయ్యారట.

NO COMMENTS

LEAVE A REPLY