జనతాగ్యారేజ్ పోస్ట్ పోన్ రీషూట్ కోసం కాదన్న కొరటాల మాటల్లో నిజమెంత

0
342

‘రీషూట్‌ అనేది తప్పేమీ కాదు.. అయినా మా సినిమాని రీషూట్‌ చెయ్యడంలేదు..’ అంటూ ‘జనతా గ్యారేజ్‌’ విషయంలో చిత్ర దర్శక నిర్మాతలు ఓ క్లారిటీ ఇచ్చినట్లే, కన్‌ఫ్యూజన్‌ని పెంచేశారు. సాధారణంగా కొరటాల శివ సినిమాలకి రీషూట్‌ అన్న మాట ఎక్కువగా విన్పించదు. చేసినవి రెండే సినిమాలు అయినా, పెర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో ఆ సినిమాల్ని కొరటాల శివ పూర్తి చేసి హిట్లు కొట్టాడు.

kortala ajahabhsj‘మిర్చి’ విషయంలోనూ, ‘శ్రీమంతుడు’ విషయంలోనూ కొరటాల మ్యాజిక్‌ పనిచేసింది. ‘మిర్చి’ సినిమా కోసం ముందుగా తీసిన ఓ ఫైట్‌ సన్నివేశాన్ని, సినిమా రిలీజ్‌ అనంతరం యాడ్‌ చేసిన విషయం విదితమే. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు ‘జనతా గ్యారేజ్‌’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని అందుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆల్రెడీ మహేష్‌ని డీల్‌ చేసేశాడు గనుక, ఎన్టీఆర్‌ని డీల్‌ చేయడం కొరటాలకి పెద్ద కష్టమేమీ కాదన్న వాదనా లేకపోలేదు.

ఇక, ‘జనతా గ్యారేజ్‌’ విషయంలో మొదటి నుంచీ కొన్ని చిన్న చిన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. షూటింగ్‌ ఆలస్యమవుతోందనీ, రీషూట్స్‌ జరుగుతున్నాయనీ గాసిప్స్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో షికార్లు చేశాయి. ఆగస్ట్‌ 12న విడుదల కావాల్సిన సినిమా సెప్టెంబర్‌ 2కి షిఫ్ట్‌ అయ్యిందని స్వయంగా కొరటాల శివ ప్రకటించడంతో ఈ గాసిప్స్‌కి మరింత బలం వచ్చి చేరింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY