కోట్లు ఆఫర్ చేసినా చలించని యంగ్ టైగర్ ఎన్టీఆర్

2
6358

ntr-ghjkgjfghdయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు యూత్ లో భారీ క్రేజ్ ఉంది, ఒక సినిమా చేస్తే 50 కోట్ల వసూళ్లు ఈజీగా కలెక్ట్ చేసే సత్తా ఉంది. అందుకే ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో అందరూ ఎగబడుతున్నారు.

ఈ మధ్యనే తమిళ్ నుండి ఏ.ఎం.రత్నం ఎన్టీఆర్ కి ఏకంగా 20 కోట్ల ఆఫర్ చూపించి ఓ రీమేక్ చేయమని రిక్వెస్ట్ చేశాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా…ఈ మధ్యనే పవన్ రీమేక్ చేయబోతున్నాడు అని అంటున్న వేదళం రీమేక్. కానీ పవన్ కన్నా ఎన్టీఆర్ అయితేనే ఆ సినిమాకు న్యాయం చేస్తాడని ఆయన భావిస్తున్నాడట.

కాగా ఇందులో యాక్షన్ సీన్స్ కి పవన్ కన్నా ఎన్టీఆర్ అయితేనే సరైన న్యాయం చేయగలడు అని ఎన్టీఆర్ వెంటపడిన ఆ నిర్మాత ఇచ్చిన ఆఫర్ ని ఎన్టీఆర్ అస్సలు పట్టించుకోకుండా నేను ఆ సినిమా చేయలేను అని చెప్పి పంపించినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ గా వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పట్లో నరసింహుడు అనే సినిమాను రీమేక్ చేయగా అది ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. అప్పటి నుండి రీమేక్ లకు దూరంగా ఉంటూ వస్తున్న ఎన్టీఆర్ ఇక రీమేక్ లు చేయను అని తెగేసి చెబుతున్నాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

LEAVE A REPLY