నైజాంలో దుమ్ము లేపుతున్న మహానటి!!

0
707

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో ఈనెల 9వ తేదీన ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందుతోంది. సావిత్రికి గల క్రేజ్ అందరినీ థియేటర్స్ కి రప్పిస్తోంది. ఆమె జీవితంలోని విషాదం .. అందుకు దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా ఎంతమాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతోంది.

 ముఖ్యంగా నైజామ్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. 5 రోజుల్లో 3.47 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, 9 రోజులకు 5.89 కోట్ల షేర్ ను సాధించింది. కథానాయిక ప్రాధాన్యత గల సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమని అంటున్నారు. దగ్గరలో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడం వలన, మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here