పవన్ కెరీర్ లో “6” ఉంటే మహేష్ కెరీర్ లో “10” ఉన్నాయి

2
3525

ఇదేమి లెక్కలు అనుకుంటున్నారా…మన స్టార్ హీరోల కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిసాస్టర్లుగా మిగిలిన సినిమాల లెక్క. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేసిన 22 సినిమాల్లో 6 డిసాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

mahesh and pawan flops listఅందులో జానీ, బాలు, కొమురం పులి, తీన్ మార్, పంజా, సర్దార్ గబ్బర్ సింగ్ లు ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ కెరీర్ మొత్తంలో 22 సినిమాలు చేయగా ఇందులో ఏకంగా 10 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాగ్ ను తెచ్చుకున్నాయి.

అవి వంశీ, టక్కరిదొంగ, బాబీ, నాని, సైనికుడు, అతిధి, ఖలేజా, 1 నేనొక్కడినే మరియు ఆగడు సినిమాలతో 9 సినిమాలు అవ్వగా ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్ లో 10 వ డిసాస్టర్ గా నిలిచింది. మధ్యలో నిజం సినిమా కూడా డిసాస్టర్ అనే అనుకున్నా ఈ మధ్యనే ఆ సినిమాతో ప్రాఫిట్స్ వచ్చాయి అని నిర్మాత అండ్ డైరెక్టర్ తేజ చెప్పడంతో అది ఇందులో చేర్చలేదు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

LEAVE A REPLY