త్వరలో గుబురు గడ్డం-మీసంతో సూపర్ స్టార్…ఫ్యాన్స్ కి పూనకాలే!!

0
499

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్లుగా దాదాపు అన్ని సినిమాల్లో ఒకే లుక్కులో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘పోకిరి’ సినిమాలో కొత్త లుక్ ట్రై చేసిన మహేష్… ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిథి’ కోసం హెయిర్ స్టైల్ మొత్తం మార్చేశాడు. అయితే ఆ లుక్ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దాంతో సినిమాల పరంగా ప్రయోగాలు చేసినా లుక్ మాత్రం ఒకేలా మెయింటెయిన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తన 25వ సినిమా కోసం న్యూలుక్ ట్రై చేస్తున్నాడట మహేష్.

టాలీవుడ్ అందగాడు ఎవరంటే… తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువమంది మహేష్ బాబుకే ఓటేస్తారు. ట్రిమ్ చేసిన మీసం… గడ్డంతో రాజకుమారుడిలా మెరిసిపోతాడు ప్రిన్స్. ఇంతవరకెప్పుడూ మీసం పెంచడం గానీ… గడ్డం పెంచడం గానీ మహేష్ చేయలేదు. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ మూవీలో ఓ సీన్లో మీసంతో కొత్తగా కనిపించాడు.

అయితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేద్దామని చెప్పాడట దర్శకుడు. గుబురు గడ్డంతో అర్జున్ రెడ్డిని తలపించే ట్రెండీ ఎలా ఉంటుందా… అని మహేష్ – వంశీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. రెగ్యూలర్ షూటింగ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి మహేష్ గడ్డం పెంచే పనిలో ఉన్నాడట. పెంచిన గడ్డం లుక్ బాగోకపోతే మేకప్ లో అడ్జెస్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here