మలయాళంలో కుమ్మేయబోతున్న సూపర్ స్టార్

0
821

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ తెలుగు రాష్ట్రాల్లో విజయవిహారం చేసింది. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పట్టారు. తమిళనాట తెలుగు వెర్షన్ కే ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తూ ఉండటంతో, తమిళంలోకి ఈ సినిమాను అనువదించి,ఈ నెల 25వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. ఈ కారణంగా అక్కడ ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువకానుంది. 

తమిళంతో పాటు మలయాళంలోను మార్కెట్ పెంచుకోవాలనుకుంటోన్న మహేశ్ బాబు, మలయాళంలోను ఈ సినిమా విడుదలయ్యేలా చూశాడు. ‘భరత్ ఎన్న అంజాన్’ అనే పేరుతో ఈ సినిమా అక్కడ కూడా ఈ నెల 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం .. అక్కడ మహేశ్ క్రేజ్ పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here