ఓవర్సీస్ లో ఆల్ టైం డిసాస్టర్ గా బ్రహ్మోత్సవం

0
685

టాలీవుడ్ లో సినిమాలకు ఓవర్సీస్ లోనూ బిజినెస్ ఉంటుందని అక్కడ మంచి సినిమాలు చేస్తే భారీ వసూళ్లు సాధించవచ్చని చేతల్లో చేసి చూపించిన స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మిగిలిన హీరోలు కూడా మహేష్ బాటలో అక్కడ తమ సినిమాలను రిలీజ్ చేసి భారీ హిట్స్ కొట్టినా….

mahesh movid disasterఆ కలెక్షన్స్ మహేష్ ఫ్లాఫ్ సినిమాల కన్నా తక్కువే అంటే అక్కడ మహేష్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం ని అక్కడ ఆల్ టైం రికార్డు రేటుకి బాహుబలి తరువాత అమ్మారు. దాదాపు 16 కోట్లకు అమ్ముడైన బ్రహ్మోత్సవం హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 3.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

కానీ తొలి ప్రీమియర్ షోకే అక్కడ డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సవం ఏ దశలోనూ అమ్ముడు పోయిన రేటుకి న్యాయం చేసేలా కలెక్ట్ చేయకపోవడంతో తొలి 4 రోజుల్లో అక్కడ అతి కష్టంమీద 1 మిలియన్ అందుకోవడ౦తో టోటల్ గా 1.5 వస్తే ఎక్కువ అంటున్నారు. అదే జరిగితే అక్కడ ఆల్ టైం డిసాస్టర్ గా ఈ సినిమా నిలవడం ఖాయం.

NO COMMENTS

LEAVE A REPLY