మహేష్-పూరీ సినిమా పై రూమర్ నిజమేనా

0
297

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో టెంపర్ తరువాత పూర్తిగా స్లో అయిన దర్శకుడు పూరీజగన్నాథ్ సంచనలమే సృష్టించాడు. టెంపర్ తరువాత చేసిన జ్యోతిలక్ష్మి-లోఫర్ సినిమాలు డిసాస్టర్లుగా మిగిలి ఇప్పుడు కళ్యాణ్ రామ్ లాంటి చిన్న హీరోతో సినిమా చేస్తూ ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో రిజక్ట్ చేయడంతో పూరీజగన్నాథ్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు.

ఇలాంటి సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో “జనగణమన” అంటూ పెట్రియాట్రిక్ మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు పూరీజగన్నాథ్. ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని కొందరు ఆలోచిస్తుంటే పూరీకి ఈ ఆఫర్ ఎలా దక్కింది అని మిగతావారు అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ముందుగా టెంపర్ కి అనఫీషియల్ సీక్వెల్ గా ఎన్టీఆర్ తో చేద్దామని అనుకున్నా ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ భారీగా ఉండటంతో సేమ్ స్టోరీని సూపర్ స్టార్ కి వినిపించగా వెంటనే ఒప్పుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలుపెట్టి వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేసే చాన్స్ ఉందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here