ఆ దర్శకుడితో సూపర్ స్టార్ సినిమా కన్ఫాం అయినట్లేనా

0
470

మొత్తానికి వంశీ పైడిపల్లి- మహేష్ సినిమా వ్యవహారం కాస్త ముందుకు కదిలినట్లే వుంది. వంశీ తయారుచేసిన కథను వినడానికి మహేష్ టైమ్ అలాట్ చేసినట్ల టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఒకటి రెండు రోజుల్లో మహేష్ కు కథ వినిపించడానికి వంశీ పైడిపల్లి రెడీ అవుతున్నాడట. 

mahesh on skshdkఊపిరి సినిమా విజయం తరువాత వంశీ పైడిపల్లి-మహేష్ కాంబినేషన్ లో సినిమా వుంటుందని వార్తలు గుప్పుమన్నాయి. పైగా మహేష్ మరో సినిమా పివిపి కి చేయాల్సి వుండడం, అలాగే వంశీ పైడిపల్లి మరో సినిమా పివిపితో చేద్దామనుకోవడం వల్ల, ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని వార్తలు వినవచ్చాయి. 

అయితే ఈ లోగా నాగ్ ఓ సినిమాను అఖిల్ తో చేయమని వంశీని అడిగారని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే అఖిల్ కు వంశీకి ఎందుకనో సెట్ కాలేదు. ఇప్పుడు మహేష్ పిలిచాడు..వంశీ ఎలాగూ మాంచి లైన్ చెబుతాడు..అంటే ఇక దాదాపు ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఖరారు అవుతున్నట్లే వుంది.

NO COMMENTS

LEAVE A REPLY