మెగా ఫ్యామిలీకి ఒకే ఒక్కడు “అల్లుఅర్జున్”

2
1318

mega family ki okkae2014 సమ్మర్ లో విడుదల అయిన రేసుగుర్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగా ఫ్యామిలీ తరువాత హిట్ కొట్టడానికి రెండేళ్ళు పట్టింది. 2014 రేసుగుర్రం తరువాత విడుదల అయిన మెగా హీరోల సినిమాలన్నీ ఎక్కువలో ఎక్కువ యావరేజ్ వరకు వెళ్ళాయి కానీ క్లీన్ హిట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ భారీ ఆశలు రేపినా డిసాస్టర్ గా మిగిలిపోయింది.ఇలాంటి సమయంలో బరిలోకి దిగిన స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ సరైనోడు సినిమాతో మార్నింగ్ షోకి నెగటివ్ టాక్ తెచ్చుకున్నా తరువాత మాత్రం ఊరమాస్ హిట్ అనిపించుకునే దిశగా అడుగులు వేస్తుంది.

టోటల్ రన్ లో 75 కోట్లకు పైగా షేర్ దక్కించుకున్న ఈ సినిమా రెండేళ్లలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో అతిపెద్ద విజయం అండ్ క్లీన్ విక్టరీ సాధించిన సినిమా అని చెప్పొచ్చు. అదీ కాకుండా అప్పుడు రేసుగుర్రంతో సాధించిన బ్లాక్ బస్టర్ ని ఇప్పుడు మరోసారి రిపీట్ చేశాడు అల్లుఅర్జున్. 

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

LEAVE A REPLY