మెగా హీరోల ఆల్ టైం టాలీవుడ్ రికార్డు

0
2180

2016 సమ్మర్ ని మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికి వరుసపెట్టి మెగా సినిమాలు సిద్ధం అయిన విషయం తెలిసిందే. కాగా ముందుగా సమ్మర్ హీట్ ని పెంచడానికి వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కేవలం మొదటి వీకెండ్ వరకే హవా కొనసాగించి రికార్డులు తిరగరాసింది.

mega heros recordssgఇక రీసెంట్ గా అల్లుఅర్జున్ సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మాస్ కి ఫుల్ ట్రీట్ ని ఇస్తూ చాలాకాలానికి మెగా హీరోలకి క్లీన్ హిట్ ని ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కాగా ఈ రెండు సినిమాలతో పాటు సాయి ధరం తేజ్ నటించిన సుప్రీమ్ కూడా కలిపి ఈ సమ్మర్ సీజన్ లో ఓ రికార్డును సొంతం చేసుకున్నాయి.

అదేంటంటే సమ్మర్ లో రిలీజ్ అయిన ఏ రెండు పెద్ద సినిమాలకైనా ఈ రెండు సినిమాల కలెక్షన్సే హైయెస్ట్ అని చెప్పొచ్చు. రెండేళ్ళ క్రితం అల్లుఅర్జున్ రేసుగుర్రం-బాలయ్య లెజెండ్ సినిమాలు మొత్తంగా 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఈసారి విడుదల అయిన 2 మెగా సినిమాలు ఇప్పటివరకు మొత్తంగా 195 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా సుప్రీమ్ సినిమా దాదాపు 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో టోటల్ గా 230 కోట్ల గ్రాస్ తో కొత్త రికార్డును సృష్టించాయి మెగా సినిమాలు.

NO COMMENTS

LEAVE A REPLY