తమిళ్ బ్లాక్ బస్టర్…తెలుగులో కష్టమే అంటున్నారు

0
179

దీపావళి కానుకగా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా ‘మెర్శల్’. దీని తెలుగు వెర్షన్ ను కూడా తెలుగులో అదే రోజు రిలీజ్ చేయాలని చూశారు. కానీ కుదర్లేదు. సెన్సార్ సమస్యలతో ఆలస్యమైంది. కనీసం వారం తర్వాత అయినా రిలీజవుతుందేమో అని చూస్తే అలా ఏమీ జరగలేదు. 

శుక్రవారానికి కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో అందరూ దీని సంగతి మరిచిపోయారు. దీని గురించి శరత్ మరార్ నుంచి కూడా ఏ అప్ డేట్ లేదు. తమిళ నిర్మాత ఇచ్చే అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ మూడు రోజుల కిందట ఒక ట్వీట్ పెట్టి సైలెంటైపోయారాయన. 

వచ్చే రెండు మూడు వారాల్లో పదికి పైగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో  ‘అదిరింది’కి థియేటర్లు దొరకడం కష్టమే. కాబట్టి ఈ సినిమా ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా కనిపించడం లేదు. వేడి మీద ఉన్నపుడు సినిమా రిలీజై ఉంటే మంచి వసూళ్లే వచ్చేవి. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here