నెల్లూరులో ఎన్టీఆర్ ని అందుకోలేకపోయిన రామ్ చరణ్

0
586

ntr-sb-mtbnsmయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ అన్ని ఏరియాల్లోను రికార్డు స్థాయి వసూళ్ళతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన జనతాగ్యారేజ్ ఆ బిజినెస్ తగ్గట్లు కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుంది.

కాగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని 7 రోజుల్లోపే సొంతం చేసుకున్న జనతాగ్యారేజ్ ఒక్క నెల్లూరులోనే క్లీన్ హిట్ కోసం 40 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. అక్కడ 2.34 కోట్ల బిజినెస్ చేసి టోటల్ గా 2.40 కోట్ల షేర్ వసూల్ చేసింది. కాగా అక్కడ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న రామ్ చరణ్ ధృవ జనతాగ్యారేజ్ ని బీట్ చేయలేకపోయింది.

ధృవకి అక్కడ మొత్తంగా 2.24 కోట్ల బిజినెస్ మాత్రమే జరగడంతో ఇన్నాళ్ళు అక్కడ డామినేషన్ చూపించిన రామ్ చరణ్ క్రేజ్ కి జనతాగ్యారేజ్ బ్రేక్ వేసినట్లు అయింది. ధృవ ఆ రికార్డును బ్రేక్ చేస్తుంది అనుకున్నా అలా జరగకపోవడంతో అక్కడ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ డామినేషన్ క్లియర్ గా బయటపడింది అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY