పైసా తీసుకోకుండా సినిమా చేస్తున్న గ్రేట్ హీరో ఎన్టీఆర్

0
13001

సాదారణంగా ఒక్క హిట్ పడ్డ హీరో అయినా ఇంకెవరైనా తమ తరువాత సినిమాకు ఓ రేంజ్ లో చార్జ్ చేస్తారు. అదే రెండు హిట్లు పడితే ఇక వారి రెమ్యునరేషన్ చుక్కలో అంచులలో ఉంటుంది. కానీ యంగ్ టైగర్ లాంటి స్టార్ హీరో టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి రెండు వరుస హిట్లు పడ్డాక కూడా ఇప్పుడు చేస్తున్న జనతాగ్యారేజ్ సినిమాకు పైసా కూడా చార్జ్ చేయడం లేదు.

ntr great hrees,మిర్చి-శ్రీమంతుడు లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్టు 12 న రిలీజ్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ ఇద్దరు పైసా కూడా తీసుకోకుండా సినిమాకి పని చేస్తున్నారట. దానికి బదులు సినిమాకు వచ్చే కలెక్షన్స్ లో వాటా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో సినిమా మొత్తం 30 కోట్లలోపు బడ్జెట్ లోనే పూర్తి కాబోతుంది.టాలీవుడ్ హీరోలు అందరూ ఎన్టీఆర్ రూట్ ని ఫాలో అయితే ఇలా బడ్జెట్ భాదలు డిసాస్టర్ భాదలు తక్కువ అవుతాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY