ఎన్టీఆర్-200 కోట్లు-రావణబ్రహ్మ…హిస్టారికల్

0
5856

ntr-sbs-ntsntప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన వార్తల్లో ఇదోటి…ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఒక్క ఎస్.ఎస్.రాజమౌళి ఒక్కడే… కానీ ఆయన గురువు కే.రాఘవేంద్రరావు తన శిష్యుణ్ణి మించే సినిమా చేయాలని కళలు కంటున్నాడు.

ఆ కళల రూపమే రావణబ్రహ్మ అంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎవ్వరూ చూపనన్ని గ్రాఫిక్స్ హంగులు చూపిన జక్కన్నను మించేలా రావణబ్రహ్మ సినిమా చేయాలని రాఘవేంద్రరావు అనుకుంటున్నారట. ఆ పాత్రకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకోవాలి అనేది ఆయన ఆలోచన అట.

ఇప్పటి జనరేషన్ లో అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకుంటూ పౌరాణికాలు చేయగల సత్తా ఉన్న ఒకేఒక్క నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే అవ్వడంతో ఆ సినిమాను ఎన్టీఆర్ తోనే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఈ సినిమా ఉండకపోయినా ఓ ఏడాదిన్నర తరువాత మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY