అమెరికాలో “అరవింద సమేత” బిజినెస్ కుమ్మేసింది!!

0
1247

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ యాక్షన్ తో కూడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణను జరుపుకుంది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. షూటింగ్ తొలి దశలో ఉండగానే ఈ సినిమా యూఎస్ హక్కులు అమ్ముడుకావడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే నిర్మాత రాధాకృష్ణ .. ఈ సినిమాతో పాటు తమ బ్యానర్లో రూపొందుతోన్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ .. సుధీర్ వర్మతో శర్వానంద్ చేస్తోన్న సినిమాలను కలిపి ఒక ప్యాకేజ్ గా అమ్మారట. అలా ఈ మూడు సినిమాలకి గాను యూఎస్ హక్కుల నిమిత్తం 18 కోట్లు ముట్టినట్టు సమాచారం. ఒక్క ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమానే పరిగణనలోకి తీసుకుంటే, 12 కోట్లు ముట్టినట్టు చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here