మెంటల్ ఎక్కిస్తున్న #ఎన్టీఆర్28 మూవీ పోస్టర్…!!

0
923

టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ కోసం టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్క నున్న మొదటి సినిమా అవ్వడం తో ఈ సినిమాపై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ పెరిగిపోగా ఈ సినిమా కోసం అభిమానులు సామాన్య ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

దాంతో క్రేజ్ మరింతగా పెరిగిపోగా సోషల్ మీడియాలో ఈ సినిమా ఫస్ట్ లుక్ అంటూ ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో సందడి చేస్తూ సినిమాపై క్రేజ్ ని మరింతగా పెంచేస్తున్నారు. మొదటగా సోల్జర్ పోస్టర్ అంటూ ఓ పోస్టర్ హాల్ చల్ చేయగా ఇప్పుడు మరో పోస్టర్ సందడి చేస్తుంది.

అదే రాముడు భీముడు అంటూ వచ్చిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ ని రాముడు భీముడు లాంటి సినిమాలో చూడాలి అనుకున్న వాళ్ళ ఆశలు నెరవేరుతాయో లేదో కానీ ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఇలాంటి సినిమా ఎన్టీఆర్ చేస్తే రచ్చ మాములుగా ఉండదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here