ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అక్కడ మోహన్ లాల్ ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చేసిన కొరటాల

0
494

సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని ప్రమోట్‌ చేసుకోవడం కూడా తెలియాలి. ఊరికే ఇతర భాషల్లో సూపర్‌ స్టార్స్‌ ను తమ సినిమాల్లో అతిథి పాత్రలు చేయించడం కాదు.. వాళ్ల ఇమేజ్‌ ను సరిగ్గా వాడుకోవడం కూడా తెలియాలి. ఇప్పుడు కొరటాల శివ ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో జనతా గ్యారేజ్‌ సినిమా చేస్తున్నాడు.

ntr and mohan lalషూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. ఆగస్ట్‌ 12న సినిమా విడుదల కానుంది. జనతా గ్యారేజ్‌ పై తెలుగుతో పాటు తమిళ, మళయాల ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం మోహన్‌ లాల్‌. తాజాగా జనతా గ్యారేజ్‌ టీజర్‌ విడుదలైంది. తెలుగులో ఎన్టీఆర్‌ కు ఉన్న ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకుని.. తెలుగు టీజర్‌ ను పూర్తిగా జూనియర్‌ పైనే ఫోకస్‌ పెట్టాడు కొరటాల శివ. కానీ మళయాల టీజర్‌ ను మాత్రం మోహన్‌ లాల్‌ కు వదిలేసాడు.

అక్కడ మోహన్‌ లాల్‌ సూపర్‌ స్టార్‌. దాంతో ఓపెనింగ్‌ లోనే ఆయనతో డైలాగ్‌ చెప్పించాడు కొరటాల. 35 సెకన్ల టీజర్‌ లో ఎన్టీఆర్‌ కనిపించేది పది సెకన్లే. మిగిలిన సీన్‌ అంతా మోహన్‌ లాల్‌ దే. మళయాలంలో జనతా గ్యారేజ్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్కడ ఏకంగా 7 కోట్లు పలుకుతుంది ఈ సినిమా. మొత్తానికి తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కలిపి 70 కోట్లకు పైగా బిజినెస్‌ చేస్తోంది ఈ సినిమా.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY