ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ కి అదిరిపోయే వీకెండ్

0
1252

టెంపర్ కి ముందు వరకు ఎన్టీఆర్ ఒక్క హిట్ కొడితే చాలు అని ఎదురుచూసిన అభిమానులకు వరుసగా టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో రెండు హిట్లు ఇవ్వడమే కాకుండా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేశాడు. నాన్నకుప్రేమతో సినిమాతో 55 కోట్ల మార్క్ ని కూడా అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు భారీ హిట్ పై కన్నేశాడు.

big weekend for ntrతన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమా అవుతుందని ఇండస్ట్రీ మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న జనతాగ్యారేజ్ సినిమాను ఆగస్టు 12 న రిలీజ్ కి సిద్ధం చేస్తున్న ఎన్టీఆర్ 4 డేస్ లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేశాడు. 12 న ఎలాగు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయం.

ఇక 13 న రెండో శనివారం అవ్వడంతో చాలాచోట్ల కలెక్షన్స్ స్టడీగా ఉంటాయి, ఇక ఆదివారం ఎలాగు ఉండనే ఉంది దానికితోడు 15 న స్వాతంత్ర్యదినోత్సవ సెలవు కూడా తోడయ్యి భారీ వీకెండ్ గా నిలిచే చాన్స్ ఉందని అంటున్నారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY