ఎన్టీఆర్ చేసిన 26 సినిమాల్లో రేర్ రికార్డు ఇప్పుడు సొంతం అయింది

0
830

ntr-fhfhfhటాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొత్తంగా జనతాగ్యారేజ్ తో కలిపి 26 సినిమాల్లో నటించాడు. ఆ 26 సినిమాల్లో పలు గెటప్స్ తో అదరగొట్టిన యంగ్ టైగర్ ఒక్కసారి కూడా వరుసగా మూడు సక్సెస్ లను దక్కించుకోలేక పోయాడు.

2010 లో అదుర్స్ మరియు బృందావనం సినిమాల విజయాల తరువాత శక్తితో హాట్రిక్ కొడతాడు అనుకుంటే ఆ సినిమా డిసాస్టర్ గా నిలిచింది. మళ్ళీ 6 ఏళ్ళకి ఎన్టీఆర్ కి హాట్రిక్ కొట్టే చాన్స్ వచ్చింది…అప్పుడు మిస్ అయిన అవకాశాన్ని ఈసారి మిస్ అవ్వనివ్వలేదు యంగ్ టైగర్.

టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి వరుస విజయాల తరువాత జనతాగ్యారేజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ ని క్రాస్ చేసి క్లీన్ విక్టరీ ని సొంతం చేసుకుని హాట్రిక్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ రికార్డు ఇలాగే మరిన్ని విజయాలు ఎన్టీఆర్ సొంతం అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY