ఎన్టీఆర్ సినిమాకు అడ్డుపడుతున్న సూపర్ స్టార్

0
1024

సంక్రాంతి బరిలో 4 పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాల నడుమ తన సినిమాను రిలీజ్ చేసినా బాక్స్ అఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో మ్యాజిక్ చేసి 55.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాగా ఇప్పుడు ఆ రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ntr movie clashingకొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ ని ఆగస్టు 12 న రిలీజ్ చేయబోతున్నాడు. కాగ ఈ సినిమాకు తెలుగులో పోటిగా రిలీజ్ అవుతుంది అనుకున్న రామ్ చరణ్ ధృవ సినిమా దసరాకి పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే.

ఇక సోలోగా కుమ్మేద్దామనుకున్న ఎన్టీఆర్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన అప్ కమింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ మొహెంజోదారోని ఆగస్టు 12 నే తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నాడట. మరి ఈ పోటిలో ఎన్టీఆర్ కి ఎంతవరకు లాస్ తెస్తాడో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY