యంగ్ టైగర్ నోట ఈ డైలాగ్స్ ఏ రేంజ్ రచ్చ చేస్తాయో

2
2386

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్, పేజీల పేజీలు డైలాగులు అనర్గలంగా చెప్పగల సామర్ద్యము ఉన్న ఎన్టీఆర్ కి పవర్ ఫుల్ సింగిల్ లైన్ డైలాగ్స్ కూడా అంతే ఈజ్ తో చెప్పి మెప్పించగలడు.

ntr dailoghesఅలాంటిది ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ జనతాగ్యారేజ్ లో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన డైలాగ్స్ చెప్పబోతున్నాడట. కాగా ప్రస్తుతం కొన్ని డైలాగులు నెట్ లో లీక్ అయ్యి హాల్ చల్ చేస్తున్నాయి అవి ఇవే.

1. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ.. భయం వేస్తే తోడుగా నడిచే నాన్నా లేకపోతే..
ఎలా ఉంటుందో నాకు తెలుసు.. మనిషికి అంతకు మించిన నరకం ఉండదు.
2. లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోడానికి నేను లక్ష్మణుడిని కాదురా..
లక్ష సముద్రాలనైనా దాటి.. ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి దూకే ఆంజినేయుడిని..
3. ఈ గ్యారేజ్ జోలికి వస్తే.. ఒక్కొక్కడి బాడీలు కృష్ణ బ్యారేజ్‌లో తేలుతాయి..
4. అన్న గ్యారేజ్‌లో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్టుల రికవరిలు కూడా చేసేస్తాడు..
5. విజయవాడ కృష్ణ బ్యారేజ్‌ను, బెంజ్ సర్కిల్‌లో నా జనతా గ్యారేజ్‌ని ఎవ్వడు టచ్ చేయలేడూ..
చేద్దాం అన్న ఆలోచన వచ్చినా చంపేస్తా…

మరి ఇవి సినిమాలోనివా లేక ఎవరో ఫ్యాన్స్ రాసినవో తెలియాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ కనుక ఈ డైలాగ్స్ చెబితే రచ్చ మాములుగా ఉండదు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

LEAVE A REPLY