టీసర్ అద్బుతంగా ఉంటుంది-ఫాన్స్ ఆగలేము అంటున్నారు

1
9910

మాస్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందువరుసలో ఉంటాడు, ఈ మధ్య తన క్రేజ్ ను టాలీవుడ్ తో పాటు సౌత్ మొత్తం పాకేలా చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో సింహాద్రి రేంజ్ హిట్ ని కొట్టాలి అని ఎదురుచూస్తున్నాడు. అందుకు తగ్గట్లే సినిమా తెరక్కుతుండటంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఎన్టీఆర్.

ntr fans on teaserప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 న రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేశారు. మే 28 న టీసర్ తోనూ ఆ రచ్చ రిపీట్ చేయాలి అనుకున్నా కుదరలేదు.

కాగా ఇప్పుడు టీసర్ రిలీజ్ ను జులై 6 కి మార్చారు. కాగా జనతాగ్యారేజ్ టీంలో కొందరు ముందే టీసర్ ని ఎడిట్ చేసే సమయంలో చూశారట. వాళ్ళు ఇప్పుడు ఫ్యాన్స్ తో టీసర్ అద్బుతంగా ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్ న్యూ లుక్ కి దేవి శ్రీ అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తోడైతే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో టీసర్ ఉంటుందని చెబుతున్నారు. దాంతో ఫాన్స్ ఎప్పుడెప్పుడు టీసర్ ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY