ఎన్టీఆర్ తో మూవీకి సై అంటున్న కరణ్ జోహార్

0
3662

ntr karan movieటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాతో చేయడానికి ఇక్కడే ఇప్పుడు భారీ క్యూ ఏర్పడితే ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి ఎన్టీఆర్ కి. ఎన్టీఆర్ డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ చూసిన బాహుబలి డిస్ట్రిబ్యూటర్ కం కో ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

దానికి సంభందించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని ప్రస్తుతం ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ బాహుబలిని అద్బుతంగా డిస్ట్రిబ్యూషన్ చేసి భారీ లాభాలు తెచ్చుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు ఎన్టీఆర్ ని బాలీవుడ్ కి పరిచయం చేయాలని చూస్తున్నాడు.

తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఇద్దరి మధ్య టాక్ నడుస్తుండగా ఎన్టీఆర్ కాల్ షీట్స్ వచ్చే రెండేళ్ళు ఫుల్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చెప్పలేమని అంటున్నారట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY