4 నిమిషాల సాంగ్ కి ఎన్టీఆర్ ఆగకుండా స్టెప్స్ వేస్తూనే ఉండాలట

0
4711

ntr shsntgbaksటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది, మిగిలిన సంగీత దర్శకుల పాటలు స్లోగా ఎక్కి స్లోగా దిగిపోతాయి, దాంతో ఆ పాటలకు ఇన్ స్టంట్ గా క్రేజ్ రావు. కానీ దేవి శ్రీ పాటలు మాత్రం సినిమా ఆడే రోజులన్నీ బాగా అలరిస్తాయి, ఇక అవుట్ పుట్ అద్బుతంగా ఉంటే ఓ పట్టాన దిగవు కూడా.

లేటెస్ట్ గా ఎన్టీఆర్ కోసం నాన్నకుప్రేమతోలో అద్బుతమైన సంగీతాన్ని ఇచ్చిన దేవి శ్రీ ఇప్పుడు జనతాగ్యారేజ్ కోసం కూడా ఓ రేంజ్ సంగీతాన్ని ఇచ్చాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 4 పాటలుషూటింగ్ పూర్తీ అవ్వగా ఇప్పుడు చివరి ఐటమ్ సాంగ్ షూట్ జరుగుతుంది.

ఆ ట్యూన్ కి మొదటి సారి విన్నప్పుడే ఫ్లాట్ అయిన ఎన్టీఆర్ దేవి శ్రీ కి ఓ హాగ్ ఇచ్చి నువ్వు సూపర్ అన్నాడట. దాంతో పాట నచ్చినందుకు దేవి శ్రీ సంతోషపడుతున్నాడట.ఈ పాటలో ఎన్టీఆర్ కి సవాల్ విసిరేందుకు అన్నట్లు 4 నిమిషాల ఫాస్ట్ బీట్ ట్యూన్ తో రచ్చ రచ్చ చేశాడట. ఎన్టీఆర్ కూడా 4 నిమిషాల తన డాన్స్ పవర్ ఏంటో చూపిస్తా అంటున్నాడు. సాంగ్ లో నాన్ స్టాప్ గా ఎన్టీఆర్ మార్క్ సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయని టాక్.

NO COMMENTS

LEAVE A REPLY