ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్…ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
407

ప్రస్తుతం త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఆ చివరి షెడ్యూల్ అయిపోగానే సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయినట్లే ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఒక్కటి బ్యాలెన్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ తారక్ తో ఒక సినిమా చెయ్యాలని కమిట్ అయ్యారని అందరికి తెలిసిందే. రీసెంట్ గా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి.

అయితే ఈ సినిమా కథ కోసం ఒక నవల హక్కులను త్రివిక్రమ్ పొందాడని వార్తలు వస్తున్నాయి. పవన్ సినిమా కోసం విదేశాలకు వెళ్లేముందు 1980 కాలం నాటి ఒక అద్భుతమైన డిటెక్టివ్ కథను కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సాదారణంగా తన సినిమాలకు తనే కథ మాటలను రాసుకుంటాడు.

కాకపోతే అఆ సినిమా కోసం యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ అనే నవల హక్కులను కొనుక్కొని దాని ఆధారంగా కథను రాసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మరో నవలను కొన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆ సినిమా పట్టాలెక్కేంత వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here