ఫ్యాన్స్ నిజంగానే పూనకాలు తెప్పిస్తున్న లేటెస్ట్ న్యూస్

0
6322

ఎన్నో రూమర్స్….ఇక కలవరు…కలవలేరు అంటూ వచ్చిన ఎన్నో వార్తలకు పులిస్టాప్ పెట్టబోతున్నారు నందమూరి హీరోలు…ఇండస్ట్రీకి షాకింగ్ గా మారిన ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి పూనకలు తెప్పిస్తుంది.

ఈ నెల 10 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరు ఒకే చోట కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ముందు ఎప్పటిలాగే రూమర్ గా అనిపించినా రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఇది నిజమయ్యేలా ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఒక్క ట్వీట్ తో బాలయ్య మనసుని గెలుచుకున్న ఎన్టీఆర్ గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకకి స్పెషల్ గెస్ట్ గా రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది జరగలేదు..కానీ ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి స్పెషల్ ప్రీమియర్ కి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది అన్న వార్తలు ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇస్తున్నాయి, మరి ఇది నిజం అవుతుందా కాదా చూడాలి మరి.

NO COMMENTS

LEAVE A REPLY