జనతాగ్యారేజ్ ఆడియో రిలీజ్ డేట్ మరోసారి మారింది

0
76

ntr movie audiochdయంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ జనతాగ్యారేజ్ ప్రేక్షకుల ముందు సెప్టెంబర్ 2 న రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా సినిమా ఆడియో వేడుకని ఈ నెల 12 న ఏర్పాటు చేయాలని ముందు భావించారు.

కానీ ఇప్పుడు మరో రెండు రోజులు పోస్ట్ పోన్ చేసి 14 న ఫిక్స్ చేసినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళలో ఫైటింగ్ సీన్ కోసం వెళ్ళిన యూనిట్ ఈ నెల 6 న తిరిగి వస్తుండగా రాగానే ఇక్కడ మరో ఫైట్ సీన్ షూటింగ్ 12 వరకు నాన్ స్టాప్ గా జరగబోతుందట.

దాంతో హడావుడిగా 12 నే ఎందుకు అనుకున్న టీం డేట్ మార్చి 14 న ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్స్ కి ఎన్టీఆర్ ఓ రేంజ్ లో స్టెప్స్ తో అదరగొట్టిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY