ఈ క్రేజ్ చూసి ట్రేడ్ అనలిస్టులు ఫస్ట్ డే ఎంత వసూల్ చేస్తుందో అంచనా వేసేశారు

0
176

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతాగ్యారేజ్ కోసమే. ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమాకి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం ఎన్టీఆర్ కి పెరిగిన క్రేజ్ అనే చెప్పాలి.

ntr sjstbhaమునుపటిలా కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ అంటే వస్తున్న రెస్పాన్స్ తో జనతాగ్యారేజ్ పై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఇప్పుడు జనతాగ్యారేజ్ ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో అని ఇండస్ట్రీ అంతా ఆశగా ఎదురుచూస్తుంది.

కాగా ఈ క్రేజ్ చూస్తున్న ట్రేడ్ పండితులు మొదటి రోజు జనతాగ్యారేజ్ కచ్చితంగా 16 నుండి 18 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టడం ఖాయం అంటున్నారు. టాక్ బాగుంటే తొలిరోజు 20 కోట్లు వచ్చినా ఆశ్యర్యపోననవసరం లేదు అని కూడా చెబుతున్నారు. మరి వీరి ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY