ట్రేడ్ లో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది

0
6843

ntr-jfhfhfhయంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోష్ మీదున్నాడు, కెరీర్ మొదట్లో ఇలాంటి క్రేజ్ ను ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు అప్పటి క్రేజ్ ను డబుల్ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. దీనికి కారణం రొటీన్ కథలను కాకుండా కొత్త కథలను ఎంచుకోవడమనే చెప్పాలి.

టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి డిఫెరెంట్ కథలతో మంచి హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో హాట్రిక్ సాధించాడు.టాలీవుడ్ లో ఉన్న రికార్డులను అన్నీ తన ఖాతాలోకి మార్చుకున్న యంగ్ టైగర్ మూడో వారంలో కూడా దూసుకుపోతున్నాడు.

కొత్తగా వచ్చిన రిలీజ్ లు ఏవి ఇంపాక్ట్ చూపించకపోవడం జనతాగ్యారేజ్ కి మరోసారి ప్లస్ పాయింట్ గా మారింది. దాంతో ఈ వీకెండ్ కూడా జనతాగ్యారేజ్ ట్రేడ్ లో ఫస్ట్ ప్లేస్ లోనే రన్ అవుతుంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే శ్రీమంతుడుకి చేరువ అవ్వడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

NO COMMENTS

LEAVE A REPLY