ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం అంటున్న హీరో

0
15466

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం క్రేజ్ పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్ళలో ఇలాంటి క్రేజ్ ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు అలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ క్రేజ్ కి ఫ్లాట్ అవ్వని హీరో లేరనే చెప్పాలి.

ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ కం డాన్సర్ లలో ఎన్టీఆర్ ముందు ఉంటాడన్నది అందరి భావన. ఇప్పుడు ఇదే మాట అంటున్నాడు యంగ్ హీరో నాగాషౌర్య. తాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అని చెబుతున్నాడు.

ప్రస్తుతం మెగా డాటర్ నీహారికతో ఒకమనసు సినిమా చేసిన నాగాషౌర్య ఆ సినిమా ప్రమోషన్ లో తను ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మరోసారి చెప్పాడు. ఎన్టీఆర్ తో పాటు ఏజ్ పెరుగుతున్న అందం తగ్గని నాగార్జున అంటే కూడా చాలా ఇష్టమని అంటున్నాడు ఈ యంగ్ హీరో.

NO COMMENTS

LEAVE A REPLY