రెండేళ్ళలో ఈ రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్న తొలి హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి

0
1570

ntr new craakebnsరెండేళ్ళ క్రితం వరకు వరుసగా ఫ్లాపులు ఎదుర్కొని.. నెంబర్ రేసులో బాగా వెనకబడిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ట్రెండుకు తగ్గట్లు మారకపోవడం వల్ల మంచి స్టామినా ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయాడు జూనియర్. కానీ ఏ ముహూర్తాన అతడిలో మార్పు వచ్చిందో కానీ..

నెమ్మదిగా వైవిధ్యం చూపించడం మొదలుపెట్టాడు తారక్. ‘ఊసరవెల్లి’ నుంచే మారే ప్రయత్నం చేసినా.. సక్సెస్ రావడానికి టైం పట్టింది. ‘టెంపర్’ దగ్గర్నుంచి అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్‌ను చూసి ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. ఆ సినిమాలో కంప్లీట్ మేకోవర్ జరిగింది. అవతారం మారింది. డైలాగ్ డెలివరీ కూడా పూర్తిగా మార్చేశాడు.

డిక్షన్ మార్చడం అన్నది అంత సులువైన విషయం కాదు. కానీ తారక్ ఈ సినిమా అంతటా ఎంతో ప్రయత్నపూర్వకంగా విభిన్నంగా డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించడాన్ని గుర్తించవచ్చు. దానికి మంచి ఫలితం కూడా దక్కింది. ఆ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’లో కూడా ఇలాగే వైవిధ్యం చూపించాడు. లుక్ పూర్తిగా మార్చాడు. డిక్షన్లో కూడా వేరియేషన్ చూపించాడు. తాజాగా ‘జనతా గ్యారేజ్’ టీజర్ చూస్తే అందులో కూడా తారక్ వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించిన విషయం గమనించవచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY