ఒక్కోటిగా పాత రికార్డులను నరుక్కుంటూ పోతున్న ఎన్టీఆర్

0
8067

ntrxvdfhttయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సుడి తిరిగినట్లుంది, మళ్ళీ ఆది-సింహాద్రి రోజులకు వెళ్లి చూస్తున్నట్లు ఎన్టీఆర్ పేరు వినిపిస్తే చాలు రికార్డుల మీద రికార్డులు కనిపిస్తున్నాయి అందరికీ. నాన్నకుప్రేమతో సినిమాతో భారీ పోటిలో రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ ఇప్పుడు సోలోగా రచ్చ రచ్చ చేయాలని డిసైడ్ అయ్యాడు.

 జనతాగ్యారేజ్ విడుదల అయినప్పటి నుండి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. సినిమాకు ఎంత వద్దనుకున్నా బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఆ బిజినెస్ ని తొలి వీక్ లోనే రాబట్టి ఎన్టీఆర్ సత్తా చాటాడు. ఇక ఏరియాల వారిగా పాత రికార్డుల బెండు తీస్తూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.

ఉత్తరాంధ్రలో ఏకంగా 5.14 కోట్లు అమ్ముడైన జనతాగ్యారేజ్ 34 రోజుల్లోనే 7.64 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో 7.20 కోట్లు పలికిన ఈ సినిమా ఇప్పటివరకు 8.65 కోట్ల షేర్ ని రాబట్టింది. సీడెడ్ లో 9.50 కోట్ల అవుట్ రేట్ పలికింది. కాగా ఇప్పటివరకు 11.70 కోట్లు దక్కించుకున్న జనతాగ్యారేజ్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా రిలీజ్ అయిన ప్రతీ చోట నయా రికార్డులతో దుమ్ము రేపుతుంది ఈ సినిమా.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY