ఎన్టీఆర్ అంటేనే రికార్డులు అనేలా చేస్తున్న జనతాగ్యారేజ్

1
984

ntr sjsmntbsntజనతాగ్యారేజ్…ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును అని టైటిల్ ఏం ఆలోచించి పెట్టారో తెలియదు కానీ ఫస్ట్ లుక్ నుండే ప్రతీ అంశంలో కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది ఈ సినిమా. సోషల్ మీడియాలో అయితే అది పీక్స్ లో ఉంది అని చెప్పొచ్చు.

ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి 12 గంటలు నాన్ స్టాప్ ట్రెండింగ్ తో రికార్డు కొత్తగా టీసర్ లాంచ్ సమయంలో ఇండియా వైడ్ గా మరోసారి దుమ్ము రేపారు. ఇక ఇప్పుడు ట్రైలర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావని చెప్పొచ్చు.

ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో 4 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్లు టీసర్లు అన్నీ ఎన్టీఆర్ వే అవ్వడం విశేషం. మరే హీరో కూడా ఈ రికార్డును ఒక్కసారి కూడా అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడు మూడోసారి ఈ మార్క్ ని అందుకున్న ఎన్టీఆర్ తన పేరు ఉంటే రికార్డులు అవే వస్తాయని మరోసారి రుజువు చేశాడు.

1 COMMENT

LEAVE A REPLY