ఎన్టీఆర్-పోసానికి అవార్డులు-ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

0
923

2015 లో ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి, వాటిలో కొన్ని సినిమాల్లో పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. హీరోల విషయంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో మహేష్ శ్రీమంతుడు సినిమాలతో ఎక్కువగా ఆకట్టుకున్నారు.

posani and ntrsssప్రభాస్-అల్లుఅర్జున్ లాంటి నటులు కూడా ఆకట్టుకున్న వారి నటన కన్నా ఆ సినిమాల డైరెక్టర్స్ కే ఎక్కువ క్రెడిట్ వెళ్ళింది. ఇదే సమయంలో సపోర్టింగ్ రోల్ లో మెప్పించిన నటుల్లో పోసాని టెంపర్ సినిమాలో అద్బుతమైన నటనతో అబ్బురపరిచాడు.

కానీ ఎందుకనో చాలా అవార్డు వేడుకల్లో నిర్వాహకులు ఎన్టీఆర్ ని పోసానిని పక్కకు పెట్టారు. కాగా లేటెస్ట్ గా జరిగిన సినీ మా అవార్డ్స్ లో ఈ ఇద్దరికీ అవార్డులు రావడంతో ఫ్యాన్స్ సంతోష౦లో మునిగితెరుతున్నారు. టెంపర్ లో ఈ ఇద్దరి నటన వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ తరువాత వచ్చిన ఏ సినిమాలో లేదని అందుకే అవార్డులు వీళ్ళని వారి౦చాయని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY