సరైనోడుకి నో చెప్పి దమ్ముకి సై అన్న ఎన్టీఆర్

0
210

టాలీవుడ్ హిస్టరీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఒక రికార్డు ఉంది, ఎన్టీఆర్ నో చెప్పిన సినిమాలు కానీ చేస్తా అని చేయకుండా వసిలేసిన సినిమాలు కానీ వేరే హీరోల చేతిలో పడితే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతాయని అందరూ చెబుతుంటారు. ఇన్నాళ్ళు నిజమైన ఈ సెంటిమెంట్ మరోసారి నిజమయ్యి ఎన్టీఆర్ కి మరో మంచి మూవీ రాకుండా చేసింది.

కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఎన్టీఆర్ దిల్, అతనొక్కడే, ఆర్య, భద్ర, కృష్ణ, కిక్, బొమ్మరిల్లు, ఊపిరి లాంటి సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఈ సినిమాలన్నీ ఇతర హీరోలు చేసి వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ చేయాల్సిన మరో సినిమా అల్లుఅర్జున్ చేసి హిట్ కొట్టబోతున్నాడు.

ఆ సినిమానే సరైనోడు సినిమా ముందుగా ఈ సినిమా స్టోరీని దమ్ము సినిమా స్టోరీ సిట్టింగ్స్ అప్పుడు చెప్పగా ఎన్టీఆర్ నో చెప్పి దమ్ము స్టోరీకి సై అన్నాడట. కాగా దమ్ము యావరేజ్ హిట్ అవ్వగా ఇప్పుడు సరైనోడు రిజల్ట్ మొదట్లో తేడా అనిపించినా తరువాత మాస్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ సూపర్ హిట్ కొట్టింది, దాంతో ఎన్టీఆర్ సెంటిమెంట్ మరోసారి రుజువు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here