యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన చేరిన నితిన్

0
1546

ఈ ఏడాది పెద్ద సినిమాలు ఇచ్చిన డిజాస్టర్ల తర్వాత సమ్మర్ చివరి చిత్రంగా వచ్చిన “అ…ఆ…” సినిమా ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరిందని చిత్ర యూనిట్ పోస్టర్లు విడుదల చేసింది.

ntr and nithin combibesఇప్పటివరకు అగ్ర హీరోలకు మాత్రమే సాధ్యమనుకున్న 50 కోట్ల క్లబ్ లో నితిన్ అలవోకగా చేరిపోవడం ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ పుణ్యమే అయినా… రికార్డు రికార్డే కదా..! దీంతో 50 కోట్ల క్లబ్ లో చేరిన అగ్ర హీరోల సరసన చేరాడు నితిన్.

ఈ ఏడాది ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలకు కూడా 50 కోట్ల క్లబ్ లో సినిమా లేదు. కానీ, సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బుడ్డోడుకు మంచి ఉత్సాహాన్ని ఇవ్వగా, అదే సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ టాలీవుడ్ కే ఊపునిచ్చింది. దీంతో 2016వ సంవత్సరం హీరోలను 50 కోట్ల క్లబ్ లో చేర్చే ఏడాదిగా కీర్తికెక్కుతోంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY