మీడియా కి యంగ్ టైగర్ స్పెషల్ పార్టీ…

0
603

 యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ఈ రోజు 35వ పుట్టినరోజు జరుపుకోబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాటు సినీ ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ పుట్టిన రోజును ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకోబోతున్నారు. విజయవాడ లో భారీ కేక్ కటింగ్ తో పాటు ఉచితంగా మజ్జిగ పంపిణీ…  హైదరాబాద్ లో బర్త్ డే పార్టీలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో తన జన్మదినం సందర్భంగా మీడియా మిత్రులకు హైదరాబాద్ లోని ఓ లగ్జరీ పబ్ లో ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీని ఇవ్వబోతున్నాడట.

అంతేకాకుండా స్వయంగా ఎన్టీఆర్ ఆ పార్టీకి హాజరై మీడియా మిత్రులందరినీ వ్యక్తిగతంగా కలవబోతున్నాడట. అయితే మీడియా మిత్రులకు ఎన్టీఆర్ పార్టీ ఇవ్వడం ఇది తొలిసారి ఏమీ కాదు. గత ఏడాది పుట్టిన రోజు నాడు కూడా ఎన్టీఆర్ ఇదే తరహాలో మీడియా మిత్రులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. 2016లో నాన్నకు ప్రేమతో విడుదలకు ముందు ఎన్టీఆర్…..మీడియాతో లో ప్రొఫైల్ మెయింటెన్ చేసేవాడు. ఆ సినిమా విడుదలకు ముందు జర్నలిస్టులతో ఎన్టీఆర్ ఎక్కువగా కలవడం ప్రారంభించారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఆ తర్వాత నుంచి తన పుట్టినరోజు ప్రత్యేక సందర్భాల్లో మీడియాకు పార్టీలు ఇవ్వడం ఎన్టీఆర్ అలవాటు చేసుకున్నాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం మోషన్ పోస్టర్ ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇదే తరహాలో మీడియా మిత్రులకు తన బర్త్ డేనాడు పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here