ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్…దిమ్మతిరిగే షాక్

0
939

రీసెంట్ గా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే.కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే రూమర్స్ టాలీవుడ్ మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చాయి.. తీరా త్రివిక్రమ్ గారి దగ్గరికి వచ్చే సరికి దాన్ని డైలాగ్ తో కొట్టి చంపేశారు. ఎదో అఆ సినిమా కథ కోసం ఒక నవల కొన్నాడు. దాంతో..ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ సినిమా కోసం కూడా పాతకాలం నాటి నవల కొన్నాడు. అందులో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్.

గూఢచారి.. స్పై..అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా కొందరు త్రివిక్రమ్ సన్నిహితులు ఆయనను అడిగేసరికి అక్కడి నుండి సమాధానం వేరేలా వచ్చిందట. అబ్బే అసలు గూడచారి కథ కానే కాదట. ఎన్టీఆర్ తో చేసే సినిమా ఆయన మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పాడట త్రివిక్రమ్.

నవ్వు నాకు నచ్చావ్ వంటి సినిమా తరహాలో కామెడీతో ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ తో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే ఆ సినిమా ఫైనల్ షెడ్యూల్ యూరోప్ లో జరుగుతోంది. ఇక జనవరి ఎండింగ్ లో త్రివిక్రమ్ తారక్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here