ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ…మరో షాకింగ్ అప్ డేట్!!

0
772

‘జై లవకుశ’ అంతిమంగా ఎన్టీఆర్ కు మంచి ఫలితాన్నందించింది. చాలా తక్కువ సమయంలో.. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేసి తన అన్నయ్యకు భారీ లాభాలే తెచ్చిపెట్టాడు తారక్. బయ్యర్ల పెట్టుబడి పూర్తిగా వెనక్కి రాకపోయినా.. నిర్మాత కళ్యాణ్ రామ్ మాత్రం మంచి లాభాలు చేసుకున్నాడు. ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా వల్ల బాగానే ముట్టినట్లు సమాచారం. ఇప్పుడిక తారక్ దృష్టంతా త్రివిక్రమ్ సినిమా మీద పడింది.

ఈ సినిమా కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేశాడు తారక్. ఓవైపు లుక్ మార్చుకుంటూనే.. అప్పుడప్పుడూ త్రివిక్రమ్ ను కలుస్తూ ఇన్ పుట్స్ తీసుకుంటూ.. స్క్రిప్ట్ నరేషన్ వింటున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. ఒకప్పటి హీరోయిన్లు కీలక పాత్రలిచ్చి.. వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం త్రివిక్రమ్ కు అలవాటు. ‘అత్తారింటికి దారేది’ నుంచి ఈ ఒరవడిని కొనసాగిస్తున్నాడు.

ఎన్టీఆర్ మూవీలోనూ అలాంటి పాత్ర ఒకటి ఉంటుందట. దాన్నే టబు చేస్తోందట. ఎన్టీఆర్ ఇంతకుమందు ‘నా అల్లుడు’లో రమ్యకృష్ణతో.. ‘అల్లరి రాముడు’లో నగ్మా తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వాళ్లిద్దరితో కలిసి డ్యాన్సులు కూడా వేశాడు ఎన్టీఆర్. ఐతే ఆ పాత్రలతో పోలిస్తే.. టబు క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుందట. ఎన్టీఆర్-టబు మధ్య సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయని సమాచారం. ఈ సినిమాకు టబు పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here