ఎన్టీఆర్ ఆయుధాన్ని లీక్ చేయకుండా జాగ్రత్తపడుతున్న కొరటాల

0
322

ntr new style of weoponటాలీవుడ్ లో హీరోల కోసం స్పెషల్ ఆయుధాలను రెడీ చేసే దర్శకుల్లో రాజమౌళి-బోయపాటి ముందు వరుసలో నిలవగా ఇప్పుడు కొరటాల శివ కూడా వారి రూట్ లోనే ప్రయాణిస్తున్నాడు. తొలి రెండు సినిమాల్లో హీరోల కోసం స్పెషల్ వెపన్స్ ని డిసైన్ చేయించాడు కొరటాల.

కాగా ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా జనతాగ్యారేజ్ కోసం కూడా ఎన్టీఆర్ కి అదిరిపోయే ఆయుధాన్ని రెడీ చేయించాడట కొరటాల శివ. కానీ ఆ వెపన్ కి సంభందించిన ఎలాంటి ఫోటోలు కానీ న్యూస్ కానీ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడట కొరటాల.

ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ హై ఓల్టేజ్ ఫైట్ సీన్ కోసం సింహాద్రి రేంజ్ కత్తిని రెడీ చేశాడట కొరటాల. ఆ ఆయుధంతో ఎన్టీఆర్ విలన్లను చంపే సీన్ సినిమాకే మేజర్ హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అది సినిమాకి మరింత హెల్ప్ అవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY