ఒక్క వార్తా….42 వేల ట్వీట్స్….రామ్ చరణ్ ఫ్యాన్స్ వీరంగం

0
961

ఎన్నాళ్ళో వేచిన ఉదయం…ఈనాడే ఎదురైనట్లు అన్న పాట ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి సరిగ్గా సరిపోతుంది…ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 ఏళ్ళు కెరీర్ కొనసాగిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో తొలి మైలురాయి ఇప్పుడు అందుకున్నాడు.

అన్నీ ఉన్నా ఓవర్సీస్ మార్కెట్ లో 1 మిలియన్ రికార్డు లేదన్న అపవాదుని ఇన్నాళ్ళు మోసిన మెగాపవర్ స్టార్ అండ్ ఫ్యాన్స్ కి ఈరోజుతో ఆ అపవాదు కూడా చెరిగిపోయింది. ధృవ ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ అయిందన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్…..

ట్విట్టర్ లో వీరంగం సృష్టించారు. ఒక్క వార్తా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూసి ఆ వార్తా విన్న వెంటనే 3 గంటల్లో 42 వేల ట్వీట్స్ వేసి ఏకంగా నేషనల్ వైడ్ గా ధృవ సినిమాను ట్రెండ్ చేసి సత్తా చాటుకున్నారు. చాన్నాళ్ళ ఎదురుచూపుకి ఇప్పుడు తెరపడటం వాళ్ళ ఆనందాన్ని డబుల్ చేసిందని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY