అభిమానుల కోసం సప్తసముద్రాలు దాటబోతున్న పవర్ స్టార్

0
667

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను  విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన అక్కడి అభిమానులు ఆయనని కలవలాని ఎప్పటినుండో అనుకుంటూ ఉన్నారు. పవన్ విదేశాలకు షూటింగ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు పవన్ ని ఆహ్వానిస్తూనే వుంటారు .. ఆయన రాకకోసం ఎదురుచూస్తూనే వుంటారు.

pawan going for fansఅలా విదేశాల్లోని అభిమానుల ఆహ్వానం మేరకు ఆయన వచ్చేనెల 9న లండన్ వెళ్లనున్నారు. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అలాగే యుకె .. యూరప్ లలో అభిమానులతో ముఖాముఖి కార్యక్రమాలకి పవన్ వరుసగా హాజరుకానున్నారు. ‘యుక్తా’వారి ఆధ్వర్యంలోనే పవన్ కల్యాణ్ కి సంబంధించిన ప్రయాణం ఏర్పాట్లన్నీ జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. తన తాజా చిత్రం సెట్స్ పైకి రావడానికి ఇంకా సమయం ఉండటంతో, పవన్ ఈ సమయాన్ని విదేశాల్లోని తన అభిమానులతో గడపడానికి కేటాయించారని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY