పవన్ కూడా పోస్ట్ పోన్ చేసుంటే సర్దార్ ఇండస్ట్రీ హిట్ అయ్యేదట

0
806

ntr anshbsghnt‘జనతా గ్యారేజ్‌’ సినిమా వాయిదా అనగానే.. సినిమా బాగా రాలేదని.. రీషూట్లు చేయాల్సి వస్తోందని.. అందుకే అనుకున్న సమయానికి రిలీజవ్వట్లేదని ఒక ప్రచారం మొదలైంది. దీని మీద దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ.. ఓ మంచి మాట చెప్పాడు. తమ సినిమాకు రీషూట్లేమీ చేయట్లేదని.. ఐతే రీషూట్లు చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు.

సినిమా విడుదలయ్యాక ఇది బాలేదు.. అది బాలేదు అనుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడితే మంచిదే కదా అన్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయంలో హడావుడి పడితే.. సినిమా ఫలితమే తేడా వచ్చేస్తుందని.. చెప్పిన రిలీజ్‌ డేట్‌కే విడుదల చేయాలన్న పట్టుదల కంటే సినిమా బాగా రావడం ముఖ్యమని సెలవిచ్చాడు. కొరటాల మాటలు వింటుంటే.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయంలో బాగా హడావుడి పడటం వల్ల అన్యాయమైపోయిన ఓ సినిమా గుర్తుకు రాకమానదు.

ఆ సినిమానే.. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌. నిజానికి ఈ సినిమా అంత పెద్ద డిజాస్టర్‌ కావాల్సినంత చెత్త సినిమా ఏమీ కాదు. ప్రథమార్ధం వరకు సినిమా చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధానికి వచ్చేసరికి తేడా కొట్టేసింది. ద్వితీయార్ధంలో ఎడిటింగ్‌ మరీ గందరగోళంగా తయారైంది. సినిమా ఏడాది కిందటే మొదలైనా.. తాపీగా షూటింగ్‌ చేసిన ‘సర్దార్‌’ టీం.. చివరి రెండు నెలల్లో తెగ హడావుడి పడింది.

NO COMMENTS

LEAVE A REPLY