పవన్ కన్నా అల్లుఅర్జున్ బెటర్ అని తేల్చేశారు

0
699

‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్రకు గానూ అల్లు అర్జున్ పలు అవార్డులను కైవసం చేసుకుంటున్నారు. ‘ఉత్తమ నటుడు’ విభాగంలో కాకపోయినా… విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా ‘స్పెషల్ క్యాటగిరీ’లో బన్నీకి పలు అవార్డులు వస్తున్నాయి.

pawan kanna ausdksఅయితే 2015లో మరో మెగాహీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గోపాల గోపాల’ సినిమాలో మోడ్రన్ కృష్ణుడుగా పవన్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ లుక్ కు, నటనకు విమర్శకులు కూడా అభినందించారు. సహజంగా సెటిల్డ్ పాత్రలకు దూరంగా ఉండే పవన్, దేవుడి గెటప్ లో మొదటిసారిగా తన స్టైల్ కు విరుద్ధంగా సెటిల్డ్ అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. పవర్ స్టార్ అతిథి పాత్ర వలనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్క్ నైనా అందుకోగలిగింది అన్న మాట వాస్తవం. కానీ యావరేజ్ గా ఉన్న సినిమాను కేవలం తనకున్న కొన్ని డైలాగ్స్ తోనే నెట్టుకొచ్చి ఆ సినిమాను కాపాడిన అల్లుఅర్జున్ కి ఇవ్వడమే కరెక్ట్ అంటున్నారు విశ్లేషకులు.

NO COMMENTS

LEAVE A REPLY