ఏంటయ్యా పవన్…ఇది కూడా ఆపేశావా

0
390

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటించవలసి ఉన్న లేటెస్ట్ మూవీ ఆగిపోయింది అంటూ ఫిలింనగర్ లో ఓ వార్తా హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలను పవన్ సన్నిహితులు ఖండిస్తూ ఉన్నా ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉంది అంటూ మరికొందరు ఈ గాసిప్పుల పై కామెంట్స్ చేస్తున్నారు.

pawan stoped mshskఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఎస్.జె. సూర్య పవన్ లేటెస్ట్ మూవీ దర్శకత్వ బాధ్యతలనుండి తప్పుకున్న తరువాత దర్శకుడు డాలీ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరినా పవన్ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు డాలీ ఏ మాత్రం వేగంగా చేయలేకపోతున్నాడని టాక్.

అంతేకాకుండా ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో పవన్ సూచనలకు భిన్నంగా డాలీ ఈ సినిమా స్క్రిప్ట్ లో అదేవిధంగా పవన్ లుక్ లోను మార్పులు చేయడం పవన్ కు ఏమాత్రం నచ్చడం లేదు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY