పవర్ స్టార్ కడపకింగ్ న్యూ అప్ డేట్స్

0
622

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ డిసాస్టర్ తరువాత చేస్తున్న కొత్త సినిమా అనుకున్న విధంగా సాగడం లేదని అందరూ అంటున్నారు. సర్దార్ ఫ్లాఫ్ తరువాత పవన్ నటించే తాజా చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఈ ప్రాజక్టులో ‘గోపాల గోపాల’ ఫేం డాలీ వచ్చి చేరిన సంగతి విదితమే. దీంతో కథ మొత్తం మారిపోయింది.

pawanshsmtbhమళ్లీ ఫ్రెష్ గా స్క్రిప్టు వర్క్ మొదలెట్టారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు డాలీ స్క్రిప్టు పనిని దాదాపు పూర్తి చేశాడట. పవన్ విని ఓకే చెబితే, ఇక సెట్స్ కు వెళుతుందని అంటున్నారు. అలాగే, కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.

ఇదిలా ఉంచితే, ఇటీవల లండన్ లో ‘యుక్తా’ వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ హైదరాబాదుకి తిరిగివచ్చారు. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగులో ఆయన పాల్గొంటారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY