అందరూ వచ్చారు పవర్ స్టార్ తప్పా

0
672

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ప్రారంభం కోసం అభిమానులతో పాటు చాలామంది ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురుచూశారు. ఇప్పుడా వేడుక జరిగిపోయింది. చిరు సినిమా తొలి రోజు షూట్ కి సంబంధిచిన పిక్చర్స్ ఇప్పటికే అభిమానుల మొబైల్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. ధృవ షూటింగ్ కోసం కశ్మీర్ ఉన్న రామ్ చరణ్.. హ్యాండ్ ఇచ్చాడు. హైద్రాబాద్ లోనే ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

pawan tappa andaruచిరు సినిమా తొలిరోజు షూటింగ్ కి పవన్ వస్తాడనే అందరూ అనుకున్నారు. అయితే ఎప్పటిలాగానే మెగా ఈవెంట్ కి పవర్ స్టార్ డుమ్మా కొట్టేశాడు. గతంలో కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో.. ఓ ప్రైవేటు కార్యక్రమం మాదిరిగా జరిగిన ముహూర్తం షాట్ ఈవెంట్ కి కూడా పవన్ హాజరు కాలేదనే విషయం మెగా ఫ్యాన్స్ మనసులో ఇంకా ెదులుతూనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ డే షాట్ కి రాకపోవడంతో అభిమానులు బాగానే ఫీలయ్యారు.

నితిన్-త్రివిక్రమ్ ల సినమా అ..ఆ.. షూటింగ్ సెట్స్ కి.. ఆ తర్వాత ఆడియో లాంఛ్ కార్యక్రమంలోనూ కనిపించే పవన్ కళ్యాణ్.. తనకు అన్నయ్య దేవుడు అని చెప్పే పవన్ కళ్యాణ్.. మరి మెగాస్టార్ కి సంబంధించిన ఈవెంట్స్ లో మాత్రం ఎందుకు కనిపించడనే ప్రశ్న ఎదురవుతోంది. అల్లు అరవింద్ – బన్నీ – వరుణ్ తేజ్ – సుశ్మిత – అల్లు శిరీష్.. ఇలా చాలామంది మెగా హీరోలు అక్కడ ప్రజెంట్ అయినా.. పవన్ ఆబ్సెంట్ కావడం మాత్రం లోటు అనే చెప్పాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY